108 సేవల మాదిరిగా మాజీ మంత్రి హరీశ్ రావు సేవలు :చింత ప్రభాకర్ MLA సంగారెడ్డి

Must read


సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో , సదాశివపేట లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి హరీశ్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించి సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

తదుపరి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్, హరీశ్ రావు సమర్థవంతమైన నాయకుడని కొనియాడారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలపై అదే స్థాయిలో స్పందిస్తూ పనిచేసే నాయకుడు హరీశ్ రావు అని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం హరీశ్ రావు పనితీరును మెచ్చుకునే వారని అన్నారు.

హరీశ్ రావు మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని, ఆయురారోగ్యాలతో పాటు మరింత మేధస్సు, శక్తిని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, డాక్టర్ శ్రీహరి, మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి, చింత సాయినాథ్, వేణుగోపాలస్వామి, సునీల్ జై, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!