జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

Must read

ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకత్వం కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. సుమారు లక్ష మంది ప్రజలను సమీకరించడం లక్ష్యంగా నిర్ణయించుకున్న బీఆర్ఎస్ నేతలు, ఈ సభను శక్తి ప్రదర్శనగా మార్చేందుకు కృషి చేస్తున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మాజీ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికారికంగా పార్టీలో చేరనుండటమే. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చితే ఈ రెండేళ్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలని ఆయన ఆకాంక్షించారు.

సభ నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ యంత్రాంగం చురుకుగా పనిచేస్తోంది. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజలను రప్పించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక బాధ్యతలను కేటాయిస్తూ, నాయకులు కార్యకర్తలతో సమన్వయం సాధిస్తున్నారు. రవాణా సౌకర్యాలు, తాగునీరు, భద్రత, పార్కింగ్ వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఈ సభకు సంబంధించి సరైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం కోసం ఈరోజు పార్టీ ముఖ్య నేతలు జగిత్యాలలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ వసంత తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

నేతలు జగిత్యాలలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానం, ఓల్డ్ బస్టాండ్ సమీపంలోని కాలేజీ గ్రౌండ్, మోతే రోడ్డు ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. ఈ ప్రదేశాలలో ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, వేదిక ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించారు. పెద్ద సంఖ్యలో జనసమీకరణ జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని విస్తారమైన స్థలం అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు.

సభను విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలు ఇప్పటికే గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. సోషల్ మీడియా, ప్రచార వాహనాల ద్వారా కూడా విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ముఖ్య నాయకుల ప్రసంగాలు సభకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సభ ద్వారా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!