పల్నాడులో రెచ్చిపోయిన ఏఎస్సై 

Must read

పల్నాడు జిల్లాలో ఒక పోలీసు అధికారిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజల భద్రత కోసం పనిచేయాల్సిన ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై) తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడడం వెలుగులోకి వచ్చింది. ఏకాంతంగా గడుపుతున్న ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలు ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కొన్ని వీడియోలతో బయటపడింది ఈ విషయం. ఆ వీడియోల్లో జంటలు ప్రైవేట్‌గా గడుపుతున్న దృశ్యాలు ఉండటంతో గమనించారు. ఈ వీడియోలను ఎవరో రహస్యంగా చిత్రీకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలని అవసరం ఉందని సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ప్రాంతాలు ఈ దందాకు కేంద్రంగా మారినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలకు వచ్చే ప్రేమజంటలు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ఏఎస్సై వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రేమ జంటలు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని గమనించి, వారిని వీడియోలు తీయడానికి ఒక స్థానిక ఆటోడ్రైవర్‌ను ఉపయోగిస్తున్నాడని సమాచారం.

జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన ఒక ఆటోడ్రైవర్ సహకారంతో ఈ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి, అనంతరం ఆ జంటలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని బాధితులు చెబుతున్నారు. “మీపై కేసులు పెడతాం, స్టేషన్‌కు తీసుకెళ్తాం” అంటూ బెదిరింపులకు దిగుతూ, వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నట్లు సమాచారం

డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న యువతులను మరింతగా వేధిస్తూ, వారి మీద లైంగికంగా ఒత్తిడి తీసుకొస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన బయటకు రావడంతో ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై ప్రజలు ఉంచిన నమ్మకానికి ఇది భారీ దెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ కేసు వెలుగులోకి రావడంతో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు న్యాయం జరగాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు, ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసు వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ, బాధితులకు రక్షణ కల్పించడం అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!