రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

Must read

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల విడుదలకు సమయం దగ్గరపడింది. ఇంటర్​ బోర్డ్​ ఆప్​ ఇంటర్ మీడియాట్​ బోర్డ్(టీీజీబీఐఈ) ఏప్రిల్ 12న ఫలితాలను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించింది.

ఫలితాల విడుదల సమయంలో వెబ్‌సైట్లు స్లో కావడం లేదా పూర్తిగా పనిచేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రభుత్వం వినూత్నమైన డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇకపై విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా సోషల్​ మీడియా వాట్​సాప్​ లో నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్నెట్ స్లోగా ఉన్నా, వెబ్‌సైట్లు మొరాయించినా ఎలాంటి అంతరాయం లేకుండా మార్కులను పొందవచ్చని అధికారులు తెలిపారు.

ఈ సేవను మీసేవానi వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా అందిస్తున్నారు. గతేడాది రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీదర్​ బాబు నేతృత్వంలో ప్రారంభించిన ఈ డిజిటల్ సేవ ఇప్పుడు మరింత విస్తరించి, ఇంటర్ ఫలితాలను కూడా అందించేందుకు సిద్ధమైందని అధికారులు తెలుపుతూ సంతోషం వ్యక్త పరిచారు.

విద్యార్థులు తమ రూల్ నంబర్ లేదా అవసరమైన వివరాలను చాట్‌బాట్‌లో నమోదు చేయడం ద్వారా తక్షణమే తమ మార్కులను తెలుసుకోవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, విద్యార్థులకు ఒత్తిడిని కూడా తగ్గించేలా ఉంటుందన్నారు.

ఈ సేవ వినియోగదారులకు అనుకూలంగా రూపొందించబడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ఎవరైనా ఈ సేవను సులభంగా ఉపయోగించుకోవచ్చు.

ఇక ఫలితాల విడుదల సందర్భంగా విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఫలితాలు ఆశించిన విధంగా రాకపోయినా నిరుత్సాహపడకుండా, తదుపరి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఓపెన్ చేసి 8096 95 8096 నంబర్‌కు ఆ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపండి. వచ్చే రిప్లైలో ‘మెనూ’ (Menu) పై క్లిక్ చేసి ‘BIE Exam Result’ ఆప్షన్‌ను ఎంచుకోండి. అనంతరం ‘Open Service’ బటన్ నొక్కండి. అక్కడ మీ హాల్ టికెట్ నంబర్, సంవత్సరం (1st/2nd Year), స్ట్రీమ్ (General/Vocational) వివరాలను ఎంటర్ చేయండి. సమర్పించిన వెంటనే మీ ఫలితం మరియు మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!