ప్రత్యక్ష దైవమే పితృదేవులు

Must read

బాల్యంలో నాన్న చండశాసనుడని
చదవండి సంస్కారం నేర్చుకోండి
సమయపాలన పాటించండి అని చెబితే అనుకున్నాను
నేను నలుగురుపిల్లల తండ్రినైన తరువాత తెలిసింది
నా ఉన్నతి గురించే నాన్న ఆవిధంగా చెప్పాడన్నది

పండుగనాడు అమ్మకి మాకు కొత్తబట్టలు కొని
తాను చినిగిన బట్టలు వేసుకుంటే నాన్న పిసినారి వాడని అనుకున్నాను
నేను సంసార జీవితంలో
ఆనాడు కుటుంబ సంతోషమే తన సంతోషమని భావించాడన్నది

అరవై సంవత్సరాలు వచ్చి
నేను మనుమల నెత్తినా
వంట్లో నలతగా ఉంటే
వణుకుతున్న చేతులతో
నా నుదుటి మీద చేయివేసి
భయంలేదు కన్నా
నా ఆయుష్షు పోసుకొని
నిండా నూరేళ్లు జీవించు
‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని
ఎనభై సంవత్సరాలు దాటి
ఆశీర్వదించిన తండ్రి
ప్రత్యక్ష దైవమే…!!

కవిమిత్ర సాహిత్యరత్న
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!