మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రారంభించారు. చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో కలిసి ఆయన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విద్యాసంస్థలు ఇలాంటి క్రీడా సదుపాయాలు కల్పించడం అభినందనీయమని తెలిపారు.ఆధునిక సౌకర్యాలతో కూడిన ఫుట్‌బాల్ గ్రౌండ్ విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని మరింత పెంచుతుందని, భవిష్యత్తులో మంచి క్రీడాకారులు తయారయ్యేందుకు ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ డా. సంకూరి కార్తీక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తూంకుంట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఫుట్‌బాల్ గ్రౌండ్ ప్రారంభించిన ఎంపీ ఈటల రాజేందర్





