ఫీజుల రియంబర్స్మెంట్ దశలవారీగా రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని అందులో భాగంగానే జీవో ఏడును రద్దు చేసినట్టే చేసి ఎనిమిది తొమ్మిది జీవోలను తెచ్చి బీసీలకు ఉరితాడు బిగించిందని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు నేడు హైదరాబాదులో ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, పాత పద్ధతిలోనే ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ తో సచివాలయం ముట్టడికి బీసీ సంఘాల నేతలు విపల ప్రయత్నం చేశారు
సచివాలయాన్ని ముట్టడిస్తారని ముందస్తు సమాచారంతో వందలాది మంది పోలీసులు సచివాలయం ముట్టడికి దశరవారీగా వస్తున్న బీసీ సంఘాల నేతలు ఎక్కడికక్కడే అడ్డుకొని సచివాలయం ముందు అరెస్టులు చేశారు, అరెస్టు చేసిన బీసీ నేతలను గోషామహాల్, హ్యాబిట్స్ పోలీస్ స్టేషనులకు తరలించారు.ఈ సందర్భంగా అరెస్టు అయిన బీసీ సంఘాల నేతలు కుళ్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్, కనకాల శ్యామ్, జాజుల లింగం, మణి మంజరి లు మీడియా తో మాట్లాడారు
రెండు మూడు రోజులు ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే సీఎం, మంత్రుల పర్యటనల ను అడ్డుకుంటామని వారి హెచ్చరించారు, శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన తమను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
అరెస్టులతో ఫీజు పోరు ఉద్యమాన్ని ఆపలేరు :జాజుల శ్రీనివాస్ గౌడ్
పాత పద్ధతిలోనే ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని, 14 లక్షల మంది విద్యార్థుల కు రావలసిన 7వేల కోట్ల ఫీజుల బకాయిలు విడుదల చేయాలని గత సంవత్సర కాలంగా శాంతియుతంగా దీక్షలు ధర్నాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఈరోజు బీసీ శ్రేణులు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు
సచివాలయం ముట్టడిగా పాల్గొన్న బీసీ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి ఘోషమాహల్, హాబిట్స్ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడంతో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ శాసనమండలి పక్షనేత సిరికొండ మధుసూదనాచారీ లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారిని పరామర్శించారు అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు
సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సచివాలయం ముందు శాంతియుత నిరసన చేపట్టాలని ప్రయత్నిస్తే అక్రమంగా అరెస్టు చేయడం చాలా అన్యాయం అన్నారు, బీసీ విద్యార్థులు ఫీజుల రియంబర్స్మెంట్ కోసం చేసే పోరాటం న్యాయమైనదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల బకాయిలను విడుదల చేసి, ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో బీసీల పోరాటానికి టిఆర్ఎస్ వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆయన హెచ్చరించారు
సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో అరెస్ట్ అయిన నాయకులు బి.మనిమంజరి, జాజుల లింగం గౌడ్, బొల్లిపల్లి స్వామి గౌడ్, పానుగంటి విజయ్ గౌడ్, బూడిద మల్లికార్జున యాదవ్, మాదేశి రాజేందర్, తారకేశ్వరి, ఇంద్రం రజక, వరుణ్ కుమార్, మహేష్ మేరు, సంపత్ నాయుడు, మధు యాదవ్, గజ్జెల సత్యరాజ్ గౌడ్, అనంతుల సాయి తదితరులు పాల్గొన్నారు





