విద్య ద్వారానే పేదరికాన్ని జయించగలం :మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

Must read

విద్య ద్వారానే పేదరికాన్ని జయించగలమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్, డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్ధులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బందికి 2025-26 సంవత్సరానికి ఎస్ఎస్ సీ, ఇంటర్మీడియట్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినందుకు సన్మాన కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

చదువే జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనమని పేర్కొన్న మంత్రి, అభివృద్ధికి కులాలు అడ్డంకి కావని, విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాస్టళ్లలో సానిటేషన్, నాణ్యమైన ఆహారం, వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు.

విద్యా శాఖలో మంత్రి లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, లోకేష్ ప్రవేశపెట్టిన ‘100 డేస్ యాక్షన్ ప్లాన్’ ఫలితంగా గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లలకు సురక్షిత వాతావరణంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.

ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన 165 మంది రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను, 132 మంది హాస్టల్ విద్యార్థులను ప్రభుత్వం ఘనంగా సన్మానించిట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, 3.53 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు రూ. 917 కోట్లు, 2.51 లక్షల మంది ప్రీ-మెట్రిక్ విద్యార్థులకు రూ.320 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. హాస్టళ్ల మరమ్మతులు, అదనపు మరుగుదొడ్లు, కొత్త భవనాల నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండు, మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో పాటు వరుసగా రూ. 20,000, రూ. 15,000, రూ. 10,000 నగదు బహుమతులు అందజేశారు. అలాగే జిల్లా స్థాయి టాపర్లను కూడా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. అత్యుత్తమ ఫలితాల సాధనలో విశేష కృషి చేసిన అధికారులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

రాష్ట్ర, జిల్లా స్థాయి టాపర్లు, అధికారులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు తదితరులు కలిపి మొత్తం 297 మందికి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం నాయక్, APSWREIS కార్యదర్శి వి. ప్రసన్న వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి, అడిషనల్ డైరెక్టర్ సునీల్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!