మాదకద్రవ్యాల ను పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా విస్తృత తనిఖీలు. సరైన పత్రాలు లేని 48 వాహనాలు స్వాధీనం .
జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ పర్యవేక్షణలో, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్యర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్‌లలో శనివారం మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించారు.
పత్తికొండ సబ్ డివిజన్ – తుగ్గలి మండలంలోని రామళ్ళ గ్రామం, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ – కడివెళ్ళ గ్రామం , ఆదోని సబ్ డివిజన్ – ఆదోని టౌన్ లో , కర్నూలు సబ్ డివిజన్ – కర్నూలు , బి. తాండ్రపాడు గ్రామం టి వి 9 కాలనీలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించారు.
మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు , పోలీసు సిబ్బంది మొత్తం 240 మంది పాల్గొన్నారు.
2 వేల మంది వ్యక్తులను తనిఖీలు చేశారు.4 వందల వాహనాలను తనిఖీలు చేశారు.
సరైన పత్రాలు లేని 48 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక , చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి, తర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది.ప్రజలతో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేయించారు.





