కష్టాలు — సులభాలు

Must read

ఆలోచించటం సుళువు
అక్షరరూపమివ్వటం కష్టము,
కలంపట్టటం సుళువు
కాగితంపై దింపటం కష్టం॥

మదికితట్టింది కూర్చటం సుళువు
మెప్పుపొందేలా రాయటం కష్టం,
మెట్లు క్రిందకు దిగటం సుళువు
కొండపైకి శిఖరం ఎక్కటం కష్టం॥

కాపీకొట్టటం సుళువు
స్వంతగా రచించటం కష్టం,
ముచ్చటించటం సుళువు
మనసును దోచటం కష్టం॥

విడిపోవటం సుళువు
కలిసుండటం కష్టం,
ఇవ్వటం సుళువు
పొందటం కష్టం॥

ద్వేషించటం సుళువు
ప్రేమించటం కష్టం,
ఖర్చుపెట్టటం సుళువు
సంపాదించటం కష్టం॥

ఏడ్పించటం సుళువు
నవ్వించటం కష్టం,
మొదలుపెట్టటం సుళువు
ముగింపుపలకటం కష్టం॥

అందరికీ వచ్చును
సులభమైనది చేయటం,
కొందరికే సాధ్యము
కష్టమైనది సాధించటం॥

సుళువుదారి వదిలి
కష్టాలబాట పట్టు,
సాఫల్య శిఖరాలను
సగర్వంగా అధిరోహించు॥

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!