స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జంట నగరాల్లోని అన్ని స్టేడియాల్లో, 33 జిల్లాలలో ఏప్రిల్ 24తేదీ నుండి ప్రారంభమైన వేసవి క్రీడా శిక్షణా శిబిరాలుజూన్ 6 వరకు నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులకు యువ క్రీడాకారుల నుండిఅనూహ్య స్పందన లభిస్తోందని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తెలిపింది.
జంట నగరాల్లోని స్టేడియంలో ఇప్పటికే 2 వేలకు మంది క్రీడాకారులకు పైగా ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకొని ఈ క్రీడల్లో పాల్గొంటున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియం, ఎల్ బి స్టేడియం, జింఖానా గ్రౌండ్,సరూర్నగర్ ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడా కేవీబి ఆర్ ఇండోర్ స్టేడియం, ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ వేలోడ్రం హుస్సేన్ సాగర్ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లలో ఈ శిక్షణా శిబిరాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహించి ఎంతో మంది క్రీడా ఆణిముత్యాలను గుర్తించి ప్రోత్సహించింది స్పోర్ట్స్ అథారిటీ. సానియా మీర్జా, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్ వంటి ఎందరో క్రీడాకారులు అజారుద్దీన్, పుల్లెల గోపీచంద్ లాంటి క్రీడాకారులకు ప్రాథమిక పాఠాలు నేర్పింది స్పోర్ట్స్ అథారిటీ.
వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్ ఫోన్లు ఆన్ లైన్ గేమ్ లు,కంప్యూటర్ల కే పరిమితం కాకుండా వారికి ఆటల ద్వారా ఆరోగ్యం అందించడమే కాకుండా మనోవికాసానికి ఈ వేసవి శిక్షణ శిబిరాలు దోహదం చేస్తాయని క్రీడా శాఖ అధికారులు తెలిపారు.
అనేక ప్రైవేట్ కోచింగ్ తో పోలిస్తే స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మైదానాల్లో అనుభవం కలిగిన కోచులు మధ్యతరగతి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రుసుముతో మంచి ప్రమాణాలు కలిగిన క్రీడా శిక్షణ అందిస్తున్నామని స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది.
విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగించే విధంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా క్రీడా మైదానాల వైపు ఆకర్షితులయ్యే విధంగా ఈ వేసవి శిబిరాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉచితంగా యోగ జుంబా డాన్స్ లలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. గత వేసవి శిబిరాల్లో ప్రవేశపెట్టిన యోగా జుంబా లకు విపరీతమైన ఆదరణ లభించిందని ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.
గతంలో కంటే ఈ సంవత్సరం ఎక్కువ క్రీడాంశాలలో శిక్షణ ఇస్తున్నామని అంతేకాకుండా కాకుండా గతంలో కేవలం జిల్లా కేంద్రాలకు పరిమితం అయినా ఈ వేసవి శిక్షణ శిబిరాలను ఈసారి పలు పట్టణ కేంద్రాల్లో కూడా నిర్వహించబోతున్నమని స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది
ఈ వేసవి శిబిరాల్లో వివిధ క్రీడాంశాల్లో అసిస్టెంట్ కోచులుగా సేవలందించే వారికి గౌరవ వేతనం గత సంవత్సరం నుండి పెంచి అనుభవజ్ఞులైన క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తోంది . ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలలో పాల్గొనబోతున్న క్రీడాకారులు విద్యార్థులను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవాలని వారి సమాచారాన్ని భవిష్యత్తులో క్రీడా అవసరాలకు వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.





