శంకర్ గౌడ్ బలిదానం వృధా కాలేదు :బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

Must read

ఆర్టీసీ సమ్మె విజయవంతం కావడం, కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం పరిష్కారానికి ముందుకు రావడం శంకర్ గౌడ్ బలిదానం వలనే సాధ్యమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు

ఇటీవల ఆర్టీసీ సమ్మె సందర్భంగా నర్సంపేట డిపో వద్ద ఆత్మ బలిదానం చేసిన కోలా శంకర్ గౌడ్ కుటుంబాన్ని నేడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నిరంజన్, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్ లు వారి కుటుంబాన్ని పరామర్శించారు మొదటగా నర్సంపేట డిపో వద్ద శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ముత్తుజిపేట గ్రామంలో వారి కుటుంబాన్ని ఓదార్చారు

ఈ సందర్భంగా మీడియాతో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యమంలో శంకర్ గౌడ్ బలిదానం వృధా కాలేదని, వారి బలిదానంతోనే రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తి ఆర్టీసీ జేఏసీ పెట్టిన అన్ని డిమాండ్లను పరిష్కరించడానికి ముందుకు వచ్చి జేఏసీతో చర్చించి చర్చలను ఫలప్రదం చేసిందని ఆయన తెలిపారు

ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయడంలో బీసీలే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని, ఇందుకు శంకర్ గౌడ్ త్యాగమే సాక్ష్యం అన్నారు ఆర్టీసీ సమ్మెను నివారించి జేఏసీతో చర్చించి కార్మికుల డిమాండ్ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఇదే సమయంలో కాగితాలలో రూపంలో కాకుండా ఆచరణలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు

శంకర్ గౌడ్ కుటుంబానీకి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలనీ, ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణం చేపట్టాలని వారి కుటుంబ సభ్యులకు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు శంకర్ గౌడ్ లాగా ఎవరు కూడా బలిదానాలు గావించవద్దని, ఇక తెలంగాణలో శంకర్ గౌడ్ బలిదానమే చివరిది కావాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.

ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఈ నిరంజన్ మాట్లాడుతూ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వంతో పాటు ఆర్టీసీలోని కార్మిక సమాజం అండగా నిలబడాలని అందుకు అనుగుణంగా తమ వేతనాలు నుండి కొంతమేరకు శంకర్ గౌడ్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన విజ్ఞప్తి చేశారు

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు బండి స్వామి, కృష్ణ, గడ్డం యాదగిరి, శ్రీనివాస్, ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు చెన్నూరు రవి ముదిరాజ్, కార్యదర్శి గుడిసెల అశోక్ గౌడ్, సుమన్ గౌడ్, కడారి సురేష్ యాదవ్, మండల అధ్యక్షులు బర్ల యాకయ్య, శ్యాం కుమార్ యాదవ్, శ్రీరామ్ శెట్టి రాజు, వరుణ్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!