ఆనంద్ బాగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. భారత రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గం నేటి సమాజానికి మార్గదర్శకమని రాంచందర్ రావు పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం, సామాజిక సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మీ, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డే సుబ్బారావు , మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్,ఎస్.సీ.మోర్చా స్టేట్ లీడర్ లవకుమార్, వాసంశెట్టి శ్రీనివాస్, ఉడుతా నవీన్, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి నివాళి: ఆనంద్ బాగ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు





