బండి సంజయ్ తప్పు చేయలేదు :రామచందర్ రావు

Must read

తెలంగాణ బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బండి సంజయ్‌పై బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ లాభం కోసం వ్యక్తులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బురదజల్లడం సరికాదని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని, అయినప్పటికీ ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కుట్రపూరితంగా ప్రచారం జరుగుతోందని విమర్శించారు.

హైదరాబాద్‌లో రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు ఏర్పాటు చేసి బండి సంజయ్‌తో పాటు బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇది రాజకీయ సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన రాజకీయ పార్టీలు వ్యక్తిగత విమర్శలకు దిగడం దురదృష్టకరమన్నారు.

బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని, దానికి బీజేపీ ఎప్పుడూ అడ్డంకి కాదని రామచందర్ రావు స్పష్టం చేశారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా బండి సంజయ్‌ను నిందిస్తూ ఆయనపై రాజకీయంగా దాడి చేయడం వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని విమర్శించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై కూడా రామచందర్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో మహిళలపై నేరాలు భారీగా పెరిగాయని అన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం మహిళలపై నేరాలు 67 శాతం వరకు పెరిగాయని ఆరోపించారు. మహిళల భద్రత విషయంలో విఫలమైన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు.

జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచారం కేసు సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందించిందో ప్రజలకు తెలుసన్నారు. ఆ ఘటనలో పలువురు ప్రభావశీలుల పేర్లు బయటకు వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఒక మహిళ జైలుకు వెళ్లినప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

ఒక మహిళా సర్పంచ్ తనను ఓ ఎమ్మెల్యే వేధిస్తున్నారని బహిరంగంగా ఆరోపణలు చేసిన సందర్భంలో బీఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని రామచందర్ రావు ఆరోపించారు. అప్పుడు కేసీఆర్ లేదా కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.

తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతోనే బీఆర్ఎస్ అసహనానికి గురవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతలపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

రాజకీయాల్లో సిద్ధాంతాల ఆధారంగా పోటీ పడాలని, కానీ కుటుంబ సభ్యులను లాగి వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తప్పుడు ప్రచారాలను నమ్మరని అన్నారు. బీజేపీ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందని, ఎలాంటి దుష్ప్రచారాలకు భయపడబోదని స్పష్టం చేశారు..

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!