కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా! :డా. రాజశేఖర్‌

Must read

యాంగ్రీ హీరో డా.రాజశేఖర్‌ను ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సత్కరించింది. డా.రాజశేఖర్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ “బైకర్‌” సినిమాలో ఆయన నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆయనకు క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవఅధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు జె.వి. బత్తుల ప్రసాద్‌రావు, సెక్రటరీ సురేష్‌కొండేటి తదితరులు బొకేను అందజేశారు. అనంతరం క్రిటిక్స్‌ ట్రెజరర్‌ భరద్వాజ సన్మాన పత్రాన్ని ఆయనకు చదివి వినిపించి, అందజేయడం జరిగింది.

సీనియర్‌ జర్నలిస్ట్‌, క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ అంకుశం ఆగ్రహం వంటి చిత్రాల్లో రాజాశేఖర్ది​ గ్రేట్‌ పెర్ఫార్మెన్స్‌. మనతో ఆయన అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన వెంకటేశ్వరావురు ఎప్పుడూ మాట్లడని వారు కూడా మాట్లాడారు అంటేనే చెప్పవచ్చు ఆయన మీడియాతో ఎంత చక్కగా ఉంటారో. సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో ఆయన స్పిరిట్‌గాని ఆయన ఉత్సాహం మరింత రెట్టింపుగా ఉండాలి.

ఫిలిం క్రిటిక్స్‌ చేస్తున్నారంటే దానికి ఒక గొప్పతనం ఏర్పడుతుంది. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావుగారు ఒకానొక సమయంలో ఫిలిం క్రిటిక్స్ చేసిన సన్మానం అనేది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అన్నారు. రాజశేఖర్‌ సహాయ సహకారాలు ఎప్పటికీ మన అందరికీ ఉంటాయి” అని అన్నారు.

జీవితరాజశేఖర్‌ మాట్లాడుతూ… “మనమందరం ఒక ఫ్యామిలీలాంటి వాళ్ళం. మీడియాతో మాకు ఎప్పుడూ బావుంటది. మమ్మల్ని మీరు ఎప్పుడూ కించపరచలేదు. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా ఎక్కువయిపోయి వాటిల్లో వచ్చే కొన్ని వార్తల వల్ల అసలు మీడియా ఏంటి జర్నలిజం ఏంటి అని కొంత కన్‌ఫ్యూజన్‌కి గురయ్యాను. రాజశేఖర్‌కి ఎన్నో అవకాశాలు వచ్చినా తను ఇన్‌స్పైర్‌ అయ్యే పాత్రలు రాక చేయడం లేదన్నారు.

హీరో రాజశేఖర్‌ మాట్లాడుతూ… ఏప్రిల్‌ 3 బైకర్‌ సినిమా రిలీజయింది. అప్పటి నుంచి నా పాత్రకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది ఎంతో మంది ఫోన్లు చేసి మెచ్చుకున్నారు. కానీ నా మనసులో ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అంటే నాకు ప్రత్యేక గౌనవం ఉంది. వేరే అవార్డులతో పోల్చితే ఇదే నాకు చాలా పెద్ద అవార్డు.

అంకుశం ముందు నాకు యాక్సిడెంట్‌ అయింది. అంకుశం పెద్ద హిట్‌ అయింది. ఆ తరువాత వచ్చిన మగాడు సినిమా కూడా పెద్ద హిట్‌ అయింది. అదే విధంగా ఇటీవలె మళ్లీ నాకు యాక్సిడెంట్‌ అయింది. బైకర్‌ మంచి హిట్‌ అయింది. ఆ తరువాత వస్తున్న సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. ఇప్పుడిప్పుడే కాస్త బెటర్‌గా ఫీలవుతున్నాను.

బైకర్‌ హిట్‌ మాత్రం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఎందుకంటే సక్సెస్‌ చూసి చాలా రోజులు అవడంతో నాకు అలా అనిపిస్తుందేమో నాకు తెలియదు. ఏది ఏమైనప్పటపికీ నేను థియేటర్‌ నుంచి బయటకు రాగానే మీరు ఇంకా సినిమాలు చేయాలి అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంకా కంటిన్యూస్‌గా రావాలి. మంచి సినిమాలు చేస్తుండాలి అని ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!