టీడీపీకి కార్యకర్తలే అసలైన బలం :నారా భువనేశ్వరి

Must read

కార్యకర్తలే టీడీపీ బలమని, ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పనిచేస్తారని నారా భువనేశ్వరి అన్నారు. అధినేత ఒక్క పిలుపు ఇస్తే చాలు…కార్యకర్తలే పార్టీని ముందుండి నడిపిస్తారన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి అన్న మాటే వినబడలేదని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. కుప్పం నియెజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మూడవ రోజు పలు కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు.

కుప్పం మండలం వసనాడులో పర్యటించిన నారా భువనేశ్వరి మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారని, ప్రజలే ఆయన కుటుంబంగా భావిస్తారని చెప్పారు. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ అభివృద్ధి, సైబరాబాద్ నిర్మాణాన్ని మనం చూశాం. 2019-2024 మధ్య రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారు. చంద్రబాబు వల్లే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు నమ్మి గెలిపించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేస్తున్నారు. పిల్లల చదువు భారం కాకూడదని తల్లికి వందనం కింద ఆర్ధిక సాయం అందిస్తున్నారని భువనేశ్వరి అన్నారు.

కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. సీఎం చంద్రబాబు పాలన సామర్థ్యంపై నమ్మకంతో ఏపీకి భారీ పరిశ్రమలు తరలివస్తున్నాయి. హంద్రీనీవాతో కృష్ణా జలాలు కుప్పానికి తీసుకొచ్చి నీటి కష్టాలు తీర్చారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం ప్రజలు మరింత భారీ మెజారిటీతో సీఎం చంద్రబాబును గెలిపించాలి. పెద బంగారుతనంలో హార్టికల్చర్ హబ్ ను సందర్శించాను. మహిళా రైతులు అనుసరిస్తున్న నూతన పంట విధానాలను పరిశీలించాను. ఒక్క పంటపైనే ఆధారపడకుండా కొత్త రకం పంటలు పండిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. అన్నదాతకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును వేగంగా నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టును అటకెక్కించింది. వచ్చే ఏడాదికి పోలవరంను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు పరుగులు పెట్టిస్తున్నారు . సీఎం చంద్రబాబు హామీ ఇస్తే వెనకడుగు వేయరు. పీ4ను పేద కుటుంబాలు అందిపుచ్చుకోవాలి. మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఆర్థికంగా బలోపేతం కావాలని భువనేశ్వరి అన్నారు.

వసనాడు జడ్పీ స్కూల్ ను సందర్శించిన నారా భువనేశ్వరి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ….మెక్కలు నాటడం విద్యార్థులంతా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇవాళ నాటిన మొక్క రేపు వృక్షమై పదిమందికి నీడనిస్తుంది. గురువులను గౌరవించాలి. తల్లిదండ్రుల కష్టాన్ని అర్ధం చేసుకోవాలి. జీవితంలో నాకు స్పూర్తినిచ్చిన వ్యక్తులు నా తల్లి, భర్త. మా నాన్న గారు సినిమా షూటింగులతో బిజీగా ఉండటంతో మా అమ్మే మా బాధ్యత చూసుకునేవారు. చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే హెరిటేజ్ బాధ్యతలు తీసుకుని ధైర్యంగా ముందడుగు వేశాను. చదువుకునే రోజుల్లో నాకు ఇంగ్లీష్ , సోషల్ ఇష్టమైన సబ్జెక్టులు. జీవితంలో సాయం చేసిన వారిని విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏఐని అవసరం మేర ఉపయోగించుకోవాలని భువనేశ్వరి సూచించారు.

వేపూరులో మహిళలతో నారా భువనేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పని చేస్తారని నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ కార్యకర్తలకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేస్తే మహిళలు బయటకొచ్చి నిరసన తెలిపారు. నేను.. నిజం గెలవాలి యాత్ర చేసినప్పుడు కార్యకర్తలు నాకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపారు. కార్యకర్తలకు ప్రమాద బీమా తీసుకొచ్చిన ఘనత లోకేష్‌దే. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా ఖాళీ చేశారు. అయినా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసింది. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నారు. వేపూరు పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.52 లక్షలు, 15 గోకులం షెడ్లు నిర్మించడంతో పాటు, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 150 ఇళ్లు మంజూరు అయ్యాయి. ఎన్టీఆర్ సుజల కింద వాటర్ ట్యాంక్‌లు , జడ్పీ స్కూల్లో భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గ్రామంలో 700 మందికి తల్లికి వందనం, 527 మందికి పింఛను అందుతోంది. రాముల వారి ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయని భువనేశ్వరి తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!