అమరావతికి చట్టబద్ధతపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ కేశినేని చిన్ని

Must read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడం పట్ల విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) హర్షం వ్యక్తం చేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.

అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లు ఆమోదం ఐదు కోట్ల మంది ఆంధ్రులలో అపార ఆనందాన్ని నింపిందని కేశినేని పేర్కొన్నారు. ఇకపై అమరావతి శాశ్వత రాజధానిగా కీర్తి పొందనుందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక మలుపుగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజల్లో అనిశ్చితిని కలిగించాయని విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో ప్రజలు తీవ్ర అయోమయంలో పడిపోయారని, తమ రాష్ట్ర రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని పరిస్థితి నెలకొన్నదని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధికి కట్టుబడి పనిచేశారని ప్రశంసించారు. రాజధాని అమరావతిని ఎవరూ కదలించలేని విధంగా శాశ్వత రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఆయన విశేష కృషి చేశారని తెలిపారు.రాష్ట్ర అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును స్వయంగా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి, ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చేశారని గుర్తుచేశారు. అనంతరం ఆ బిల్లు పార్లమెంటుకు వెళ్లి, లోక్‌సభ మరియు రాజ్యసభల్లో ఆమోదం పొందడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతున్న సమయంలో తాను విజయవాడ ఎంపీగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని కేశినేని తెలిపారు. ఇది తన రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీకు తెలుగు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రాజధాని చట్టబద్ధత కోసం కృషి చేసిన నాయకత్వాన్ని ఆయన అభినందించారు.అలాగే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత మరియు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!