టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడిని వివాహం చేసుకుంటూ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆదివారం (ఏప్రిల్ 26, 2026) నాడు జరిగిన ఈ పెళ్లి వేడుక కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది.
ఈ పెళ్లి వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వధూవరుల దుస్తులు. మెహ్రీన్, ఆమె వరుడు ఇద్దరూ లేత గులాబీ రంగు మ్యాచింగ్ దుస్తుల్లో అందంగా మెరిసిపోయారు. పెళ్లి వేడుకలో ఇద్దరూ ఒకరికొకరు వివాహ ప్రమాణాలు చేసుకుంటూ, సాంప్రదాయ రీతిలో ఒకటయ్యారు. ఈ క్షణాలు ఎంతో హృద్యంగా నిలిచాయి.
వధువుగా మెహ్రీన్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. అద్భుతమైన సీక్విన్ వర్క్‌తో రూపొందించిన లెహెంగా ఆమెకు మరింత అందాన్ని తెచ్చింది. లేయర్డ్ స్టోన్ నెక్లెస్, దానికి సరిపోయే చెవిపోగులు, పాపిడి బిళ్ల వంటి ఆభరణాలతో తన బ్రైడల్ లుక్‌ను సంపూర్ణం చేశారు. తలపై మేలిముసుగు, తేలికపాటి మేకప్‌తో ఆమె అందం మరింత మెరుగైంది. ఈ వేడుకలో ఆమె స్టైల్, ఎలిగెన్స్ ప్రత్యేకంగా కనిపించాయి.
పెళ్లి అనంతరం ఈ సంతోషకరమైన వార్తను మెహ్రీన్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ “26.04.26” అనే ప్రత్యేక తేదీని జతచేశారు. అలాగే ఇన్ఫినిటీ, రెడ్ హార్ట్, దిష్టి చుక్క ఎమోజీలతో తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ‘అర్సదీ మోహర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఉపయోగించారు. ఈ హ్యాష్‌ట్యాగ్ వధూవరుల పేర్ల కలయికగా ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెళ్లికి సంబంధించిన ఇతర వేడుకల ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ వార్త వెలుగులోకి రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు నవదంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘కేజీఎఫ్’ సినిమా ద్వారా గుర్తింపు పొందిన శ్రీనిథి శెటట్ఇ “Congrats babe.. love and only love” అంటూ తన అభినందనలు తెలియజేశారు. మరో హీరోయిన్ సెనల్ చౌహన్ కూడా “Oh my God.. congrats” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మెహ్రీన్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పటిలాగే గోప్యంగా ఉంచడం గమనార్హం. తన ప్రేమ వ్యవహారం గురించి ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించని ఆమె, పెళ్లి విషయాన్ని కూడా సడెన్‌గా ప్రకటించారు. వరుడి గురించి పూర్తిస్థాయి వివరాలు ఇంకా బయటకు రాలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.





