లాల్వానీ నగర్‌లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

Must read

వినాయక నగర్​ లాల్వానీ నగర్ ఆసోసియేషన్ కాలనీ నివాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కాలనీలో బోరు నీరు కలుషితమవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నివాసులు, వినాయక నగర్ మాజీ కార్పోరేటర్ కాన్యం రాజ్యలక్ష్మి ను కలిసి తమ సమస్యలను వివరించారు.

డ్రైనేజీ నీరు బోర్లలోకి చేరడం వల్ల తాగునీరు పూర్తిగా కలుషితమవుతోంది. ముఖ్యంగా ప్రస్తుత వేసవి కాలంలో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో, అందుబాటులో ఉన్న బోరు నీరే వినియోగించాల్సి వస్తోంది. అయితే, అదే నీరు కాలుష్యానికి గురవ్వడంతో ప్రజలు అనారోగ్యల బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై స్పందించిన మాజీ కార్పోరేటర్ రాజ్యలక్ష్మి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) జనరల్ మేనేజర్ సునీల్‌తో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. కాలనీలో కలుషిత నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

దీనికి స్పందించిన అధికారులు, కాలనీలో శుభ్రపరిచే చర్యలు చేపట్టి, డ్రైనేజీ నీరు బోర్లలోకి చేరకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే నీటి నాణ్యతను మెరుగుపరచడానికి అవసరమైన సాంకేతిక చర్యలను కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కాలనీ నివాసులు మాజీ కార్పోరేటర్ రాజ్యలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను వినగానే వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించారన్నారు. ప్రజల సమస్యలపై స్పందించే ప్రజాప్రతినిధులు అవసరమని వారు అభిప్రాయపడ్డారు.

డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ వ్యవస్థలు సమర్థంగా నిర్వహించకపోతే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి వినియోగం పెరగడంతో పాటు భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల కాలుష్యం మరింత ప్రభావం చూపుతుంది. లాల్వానీ నగర్‌లో తలెత్తిన ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవడం వల్ల కాలనీ వాసులకు కొంత ఉపశమనం లభించింది.

భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. జనర్​ మేనేజర్​ సునీల్​, టీ నవీన్​ వాటర్​ వాల్స్ మేనేజర్​, కార్యకర్తలు ఓం ప్రకాశ్​, సాయి సురేష్, మహేష్, కాలనీ వాసులు, ప్రేమ్​, గోపాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!