మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది :మంత్రి కొలుసు పార్థసారథి

Must read

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారిని మంత్రి కొల్లసు పార్థసారథి దర్శించుకున్నారు. అనంతరం మహిళా సాధికారతపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే మహిళలకు రాజకీయంగా మరింత బలం చేకూరుతుందన్నారు.

శనివారం మంత్రి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కి ఆలయ ఈవో వీకే శీనా నాయక్ స్వాగతం పలకగా ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు.

అనంతరం మంత్రి కొలుసు పార్ధ సారథి మీడియాతో మాట్లాడుతూ… తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మహిళా సాధికారత దిశగా మహిళా బిల్లు కీలకమని, అది ఆమోదం పొందుతుందని ఆశించామని చెప్పారు. ఆ బిల్లు ఆమోదం పొందితే తన పుట్టినరోజు మరింత ఆనందంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. శాసనసభలు, పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా వారి సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించబడతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మహిళలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని, వారి ప్రతిభను వెలికితీయడానికి అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు సమాజం నుంచి పూర్తి మద్దతు అవసరమని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

అయితే కూటమి నాయకత్వంలో ఆ బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. మహిళల రాజకీయ సాధికారతకు అడ్డంకులు కలగడం సమంజసం కాదని అన్నారు.

మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళల అభివృద్ధి, సాధికారతకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!