పూలే ఆశయాలు ఆచరణలో పెట్టాలి – మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్

Must read

సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌.ఎం‌.డి ఫరూక్ పిలుపునిచ్చారు.

శనివారం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొని పూలే విగ్రహానికి పుష్పమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జయంతోత్సవ సభను మంత్రి, కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్‌.ఎం‌.డి ఫరూక్ మాట్లాడుతూ పూలే గారు భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహానుభావుడని పేర్కొన్నారు. కుల, మత వివక్షలను ఎదుర్కొంటూ సమాన హక్కుల కోసం పోరాడిన ఆయన జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారు సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. స్త్రీ విద్య ప్రాధాన్యతను ఆయన ఎంతో ముందుగానే గుర్తించి, తన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో ఆడపిల్లల కోసం పాఠశాలలను స్థాపించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు రమణయ్య గౌడ్, జిల్లెల్ల శ్రీనివాసులు, బాలస్వామి, నాగశేషుడు, సుధాకర్, రామచంద్రరావు, కొమ్ము పాలెం శ్రీనివాసులు, వేణుగోపాల్ నాయుడు తదితరులు జ్యోతిరావు పూలేను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!