మహాత్మా జ్యోతి రావు సేవలు చిరస్మరణీయం…ఎంపీ బస్తిపాటి నాగరాజు

Must read

మహాత్మా జ్యోతిరావు సేవలు చిరస్మరణీయం, చదువుతోనే సమాజ మార్పు సాధ్యమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు… జ్యోతి రావు ఫూలే 200వ జయంతి సందర్బంగా నగరంలోని బిర్లా గేట్ సర్కిల్ లో ఉన్న ఫూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించిన ఆయన, అనంతరం అక్కడే నిర్వహించిన సభలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న కాలంలో జన్మించిన ఫూలే వాటి నిర్మూలన కోసం విద్యను ఆయుధంగా ఎంచుకుని సమాజ మార్పుకు కృషి చేశారని ఆయన అన్నారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఫూలే నిలిచారని గుర్తుచేస్తూ, మహిళా విద్యకు వారు చేసిన సేవలు అపారమని తెలిపారు.

విద్య ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడమే కాకుండా, వితంతువులకు ఆశ్రయం కల్పించడం వంటి సంస్కరణాత్మక కార్యక్రమాలు చేపట్టారన్నారు..ఫూలే ఆశయాలను అందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తనకు ఎంపీగా అవకాశం కల్పించడం జరిగింది. రాబోయే ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదం పొందుతుంది అన్నారు. రాష్ట్రం లో పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశముందని, అందులో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు.

కర్నూలులో బీసీ భవనం ఏర్పాటు చేయాలని సూచిస్తూ, మంత్రి టీజీ భరత్ గుప్తా రూ.1 కోటి నిధులు మంజూరు చేశారని, ప్రస్తుతం ఉన్న బిసి భవన్ కొరకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశం లో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, బీసీ వెల్ఫేర్ అధికారిని ప్రసూన, బిసి ఈడి జాకిర్ హుస్సేన్ , జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ , కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప , వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, బి సి , వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!