వెంకట్రామిరెడ్డి తొలగింపుపై జగన్ ఆగ్రహం

Must read

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడెక్కితున్నాయి. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిను సర్వీసు నుంచి తొలగించిన అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ చర్యపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.

జగన్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరినందుకే వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగుల హక్కుల కోసం మాట్లాడిన వ్యక్తిని శిక్షించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.

ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఐఆర్ వంటి అంశాలను జగన్ ప్రస్తావించారు. ఈ హక్కులను అమలు చేయాలని అడగడం వెంకట్రామిరెడ్డి చేసిన నేరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చలేక, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.

‘రెడ్ బుక్’ రాజ్యాంగం పేరుతో ప్రభుత్వం ప్రతిపక్ష స్వరాలను అణిచివేయాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని ఓ సీఐ అభ్యంతరం వ్యక్తం చేసినందుకు ఆయన్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించారని గుర్తు చేశారు. ఈ ఘటనలు చంద్రబాబు పాలనలో నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు.

ఇక గత ఉదాహరణలను ప్రస్తావిస్తూ జగన్ మరో ప్రశ్న లేవనెత్తారు. గతంలో ఏపీ ఎన్జీవోస్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం అమలు చేయడం సరైన విధానం కాదని విమర్శించారు.

ప్రస్తుత ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతోంది. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, ప్రభుత్వ విధానాలపై అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై వివిధ వర్గాలు స్పందిస్తున్నాయి.

ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు రాజకీయ చర్చల్లో కీలక అంశంగా మారే అవకాశం ఆంధ్రప్రదేశ్​ మారుతుంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!