ఇరాన్ అమెరికాల మధ్య ఏర్పాడిన తాత్కలిక ఒప్పందం కారణంగా ఆగి యుద్ద సమయంలో విశాఖ నగరంలో చదువుకుంటున్న ఇరాన్ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా . తమ దేశంలోని కుటుంబ సభ్యులతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో వారితో పూర్తి సమాచారాన్ని పొందలేక సతమతం అవుతూ మానసిక ఒత్తిడికి లోనవుతుమన్నారు.
విశాఖలోని డీఫార్మసీ కోర్సులో చేరిన కొందరు ఇరాన్ యువతులు జిల్లా కలెక్టరేట్‌ను ఆశ్రయించగా, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) విశ్వేశ్వర్ నాయుడును కలిశారు. వారు తమ పరిస్థితిని వివరించి, తమను సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు మద్దతు ఇవ్వమని కృతజ్ఞతతో కోరారు. తమ వారిని చూడాలని, వారితో మాట్లాడాలని వారు ఉత్సహం చూపిస్తున్నామని తెలిపారు.
యుద్ధం కారణంగా ఇరాన్‌లోని కుటుంబ సభ్యులతో పూర్తి తస్సబందాలు లేవని.. ఇప్పటికైన తమను తమ దేశానికి పంపించాలని కుటుబం సభ్యుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై సమాచారం తెలియక తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నామని వారు వాపోయారు. ఈ పరిస్థితి వారిని అత్యంత ఆందోళనకు గురిచేస్తుందని ఆవేద వ్యక్తం చేశారు.
స్పందించిన అధికారులు తక్షణమే విద్యార్థుల భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పద్ధతుల ద్వారా సురక్షితంగా తమ స్వదేశానికి పోవడానికి మార్గదర్శకాలు అందించడం పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. .
ఏపీ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ పరిస్థితులు విద్యార్థుల విద్య, భవిష్యత్తు ప్రణాళికలకు కూడా ప్రభావం చూపేలా మారుతున్నాయని ఈ సంఘటను బట్టి తెలుస్తుంది.





