ఆసుపత్రులపై దాడులు అమానుషం: ఇరాన్ ఆగ్రహం

Must read

ఇటివల ఇరాన్​ ఆసుపత్రులపై జరుగుతున్న దాడులకు గాను ఇరాన్​ ఆవేదన వ్యక్తంచేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలలు వైమానిక దాడుల్లో ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని ఇరాన్ ఆరోపించింది. ముఖ్యంగా నిరపరాధ ప్రజలు, చికిత్స పొందుతున్న రోగులపై దాడులు చేయడం అమానుషమని తీవ్రంగా మండిపడింది.

ఇటీవల టెహ్రాన్ నగరంలోని గాంధీ ఆసుపత్రిపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ, ఆ భవనం ధ్వంసమైన దృశ్యాలను ఇరాన్ అధికారులు విడుదల చేశారు. ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆసుపత్రి వంటి సున్నిత ప్రాంతాలపై దాడులు జరగడం యుద్ధ నేరాలకు విరుద్దమని ఇరాన్ పేర్కొంది.

అమెరికా, జ్రాయెల్ వైమానిక దాడుల్లో దేశవ్యాప్తంగా 600 కంటే ఎక్కువ వైద్య కేంద్రాలు దెబ్బతిన్నాయని ఇరాన్​
ఆరోపించింది. ఈ దాడుల్లో అనేక మంది రోగులు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసింది. గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలతో దేశంలో ఆరోగ్య సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు బలహీన స్థితిలో ఉంటారని, అలాంటి సమయంలో వారిపై దాడులు జరగడం మానవతా విలువలకు విరుద్ధమని ఇరాన్ విమర్శించింది. అంతర్జాతీయ సమాజం ఈ విషయంపై స్పందించి, ఇలాంటి దాడులను నిలిపివేయాలని కోరింది.

అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఈ ఆరోపణలపై అధికారిక ప్రతిస్పందన వెలువడాల్సి ఉంది. అయితే ఇరాన్ చేసిన ఈ ఆరోపణలు అంతర్జాతీయ వేదికలపై చర్చకు దారి తీసే అవకాశముంది. ఇప్పటికే మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఆరోపణలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశముంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!