వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి :కలెక్టర్ మను చౌదరి

Must read

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడదెబ్బ తగలకుండా, వడగాలుల లో తీసుకోవలసిన నివారణ చర్యలకు సంబంధించి చేయవలసినవి,చేయకూడని వాటి పై సూచనలను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఒక ప్రకటనలో జారీ చేసారు. ఇట్టి అంశాలను జిల్లా ప్రజలు తెలుసుకొని తదనుగుణంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

చేయవలసినవి:
సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. ఉల్లిపాయ సలాడ్, ఉప్పు, జీలకర్రతో కూడిన పచ్చి మామిడి వంటి సాంప్రదాయ నివారణలు వడదెబ్బను నివారించగలవని సూచించారు. పిల్లలను లేదా పెంపుడు జంతువులను మూసి ఉన్న వాహనంలో ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టవద్దని, ఫ్యాన్లను వాడుతూ, తరచుగా చల్లటి నీటితో స్నానం చేయాలని సూచించారు.

మీ ఇంటికి లేదా కార్యాలయానికి వచ్చే అమ్మకందారులకు మరియు డెలివరీ చేసేవారికి నీటిని అందించాలని, ప్రజా రవాణాను, కార్-పూలింగ్‌ను ఉపయోగించాలని, తద్వారా భూతాపాన్ని, వేడిని తగ్గించడానికి సహాయపడుతుందని వివరించారు.

చేయకూడనివి:
ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 గంటల నుండి 3:00 గంటల మధ్యలో ఎండ తగిలే ప్రదేశాలలోకి వెళ్లకూడదని, మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శ్రమతో కూడిన కార్యకలాపాలను నివారించాలని, కాళ్లకు చెప్పులు లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించారు.

ఎండ ఎక్కువగా సమయాల్లో వంట చేయడం మానుకోవాలని, వంట చేసే ప్రదేశానికి తగినంత గాలి వచ్చేలా తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. శరీరాన్ని నిర్జలీకరణం చేసే మద్యం, టీ, కాఫీ,కార్బోనేటెడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలన్నారు.

గర్భిణీ స్త్రీలు,అనారోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులపై అదనపు శ్రద్ధ వహించాలని సూచించారు. శరీరాన్ని నిర్జలీకరణం చేసే మద్యం, టీ, కాఫీ, కార్బోనేటెడ్ దూరంగా ఉండాలన్నారు. అధిక ప్రోటీన్, ఉప్పు, కారం, నూనెతో కూడిన ఆహారాన్ని తీసుకోకూడదని వివరించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!