వినాయక్ నగర్ డివిజన్‌లోని రేణుక నగర్ ప్రాంతంలో జరుగుతున్న చివరిదశ బాక్స్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. పనులు నాణ్యతగా, వేగంగా పూర్తి చేయాలని, ఉన్న పూడికను తొలగించిన తరువాతనే బాక్స్ డ్రైన్ కు స్లాబ్ వెయ్యాలని అధికారులకు సూచించారు. నీటి నిల్వలు లేకుండా ప్రజలకు వర్షపు నీటి ముప్పు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవస్థ మెరుగుపర్చడం ముఖ్యమని ఆమె అన్నారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ పనులతో ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెతో బాటు బీజేపీ కార్యకర్తలు ఓం ప్రకాష్, సాయి సురేష్, వెంకటేష్, బాల కృష్ణ తదితరులు ఉన్నారు.
రేణుక నగర్ బాక్స్ డ్రైన్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి





