కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగింపు

Must read

రాష్ట్రంలో కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగించడం జ‌రిగింద‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు. ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి కందులు (రెడ్ గ్రామ్/తూర్) కొనుగోలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయం అని అన్నారు. రాష్ట్రంలో ధర మద్దతు పథకం (PSS) కింద కొనుగోలు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. కొనుగోలు గడువును పొడిగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తిని ప‌రిశీలించిన‌ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, మే 4 వరకు పొడిగింపునకు ఆమోదం తెలిపిందన్నారు. రైతులు తమ పంటను నష్టపోకుండా విక్రయించుకునేలా చూడటం కూట‌మి ప్రభుత్వ బాధ్యత. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు అని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. పంటల కొనుగోలు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వంటి అన్ని అంశాల్లో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగిస్తాము అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!