దేశ అంతర్గత భద్రతలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నక్సలిజం, ఉగ్రవాద నిర్మూలనలో సీఆర్పీఎఫ్ జవాన్లు చేస్తున్న క్రుషి ప్రశంసనీయమన్నారు.
ధైర్యం, నిజాయితీ, త్యాగం, సమర్పణకు సీఆర్పీఎఫ్ ప్రతీకగా నిలిచిందన్నారు. మానవతా సాయం అందించడంలోనూ సీఆర్పీఎఫ్ ముందంజలో ఉండటం ప్రశంసనీయమని కొనియాడారు. హర్యానాలోని గురుగ్రాం సీఆర్పీఎఫ్ అకాడమీలో జరిగిన 56వ బ్యాచ్ గెజిటెడ్ అధికారుల స్నాతకోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, అకాడమీ డైరెక్టర్ అమిత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ముందుగా మరవీరుల స్థూపం వద్ద అంజలి ఘటించిన కేంద్ర మంత్రి అనంతరం స్నాతకోత్సవ వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ పోలీసులను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ CRPF 56వ బ్యాచ్ శిక్షణార్థి అధికారుల స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన స్నాతకోత్సవ పరేడ్ సీఆర్పీఎఫ్ అత్యున్నత స్థాయి క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తోంది.
పరేడ్లో పాల్గొన్న అధికారులు 52 వారాల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని విధులకు సిధ్ధమవడంవ సంతోషం. మాతృభూమికి సేవ చేయడానికి తమను తాము అంకితం చేసుకోవడం కంటే గొప్ప కర్తవ్యం మరొకటి లేదు. దేశసేవ అనే పవిత్ర ప్రతిజ్ఞే అత్యున్నత కర్తవ్య నిబద్ధతకు సంకేతం, ఇది ఏ పౌరుడైనా తన దేశం కోసం తీసుకోగలిగే అత్యుత్తమ ప్రతిజ్ఞ అన్నారు.
దేశసేవలో సమర్పణ, నిబద్ధత, త్యాగం అంతర్భాగాలుగా ఉంటాయి. సీఆర్పిఎఫ్ ఆదర్శ వాక్యం ‘సేవ, నిష్ఠ’. సవాళ్లతో కూడిన ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
సీఆర్పిఎఫ్ దేశంలోని అతిపెద్ద సాయుధ పోలీస్ దళం. దేశంలో అంతర్గత భద్రతను కాపాడటంలో ఈ దళం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. రాబోయే కాలంలో మీరందరు ఈ బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తారని నాకు విశ్వాసం ఉంది.
1939లో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఏర్పడినప్పటి నుండి కర్తవ్య నిబద్ధత, వీరత్వానికి నిదర్శనంగా ఉంది. ఈ దళం నేడు ధైర్యం, నిజాయితీ, త్యాగం, సమర్పణకు ప్రతీకగా నిలిచిందన్నారు.





