నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీలు పట్టాలెక్కాలి :సీఎం చంద్రబాబు

Must read

రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు.

అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026-31 త్వరలోనే తీసుకురావాలని సీఎం నిర్దేశించారు.

ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్, మెడ్ టెక్ ఉత్పాదనలు, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్ అందించడం, స్కిల్లింగ్, అమరావతి-వీఈఆర్‌లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలన్నారు.

అమరావతిలో నేచరోపతి సంస్థ కేంద్ర నెలకొల్పేలా ఆయుష్ శాఖ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. సచివాలయంలో బుధవారం సంజీవని ప్రాజెక్టు, పాపులేషన్ మేనేజ్మెంట్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్యారోగ్య శాఖ, ఆర్ధిక, స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు శాఖ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ప్రజలకు వైద్య ఖర్చులు భారం తగ్గించేలా ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజెన్ హెల్త్ స్క్రీనింగ్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఇందుకోసం పబ్లిక్ హెల్త్ డేటాను వినియోగించుకోవాలన్నరు. సంజీవని ప్రాజెక్టు కింద ఇప్పటివరకు 1.08 లక్షల మందికి వైద్య సేవలు పొందారని, 2.8 లక్షల మందికి మందులు పంపిణీ చేయగా, 19 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

సంజీవని ప్రాజెక్టు వేగంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ సేవల్ని డిజిటలైజ్ చేసినా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆశించిన స్థాయిలో పనిచేయకుంటే ఫలితాలు రావని ముఖ్యమంత్రి అన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!