ఏపీలో పిడుగుల పాటుకు 9 మంది మృతి

Must read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అకాల వర్షాలు తీవ్రంగా వణికిస్తున్నాయి. సాధారణంగా ఈ కాలంలో ఉండకూడని భారీ వర్షాలు కురవడంతో పాటు పిడుగులు పడటం ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పిడుగుపాటుకు గురై మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర ప్రజలకు అందోళన కలిగిస్తుంది.

సోమవారం ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు మృత్యువాత పడటం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో మృతుల కుటుంబాల్లో తీరని శోకం అలుముకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా వర్షం ప్రారంభమై, పిడుగులు పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించినప్పటికీ, వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇక విజయనగరం విజయనగరం జిల్లా వంగరలో పొలంలో పనిచేస్తున్న ఇనముల నర్సమ్మ (48) అనే మహిళా రైతు పిడుగు తాకడంతో అక్కడికక్కడే మరణించారు. వర్షాల సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మిగతా మరణాలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నమోదయ్యాయి. ప్రతి సంఘటన వెనుక ఒక కుటుంబం కూలిపోయిన దుస్థితి కనిపిస్తోంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ, తమ ప్రియమైన వారిని కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేకపోతున్నారు.

వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అత్యవసర అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచిస్తుంది. ముఖ్యంగా రైతులు, కూలీలు పొలాల్లో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

ప్రభుత్వం ఈ ఘటనలపై స్పందించి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. స్థానిక అధికారులు బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ, వారికి అవసరమైన సహాయం అందించే చర్యలు తీసుకుంటున్నారు.

బాధితులు కూడా వరుస ఘటనలతో సతమతమౌతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!