సొంతిళ్లులా బీసీ గురుకులాలు, హాస్టళ్లు :సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు

Must read

అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో విద్యనభ్యసించే విద్యార్థుల డైట్ బిల్లులు పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. ఎంజేపీ స్కూళ్ల శాశ్వత భవన నిర్మాణాలకు రూ.500 కోట్ల సాస్కి నిధులు మంజూరు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేశారు.

బీసీ బిడ్డల విద్య పట్ల సీఎం చంద్రబాబుకున్న చిత్తశుద్ధికి డైట్ ఛార్జీల పెంపుతో పాటు సాస్కి నిధులు మంజూరే నిదర్శనమన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి సవిత ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అన్ని సంక్షేమ శాఖ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతమిస్తున్న డైట్ ఛార్జీలకు పది శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు కల్పించే ఉద్దేశంతో రూ.500 సాస్కి నిధులు జారీచేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.

ఈ నిర్ణయాలపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా అన్ని గురుకులాలు, హాస్టళ్లలో అమలవుతున్న పది శాతం డైట్ ఛార్జీలు పెంచాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకోవడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలుకలుగుతుందన్నారు. ముఖ్యంగా బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం రెండేళ్లలో వందల కోట్లు వెచ్చిస్తోందన్నారు. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం పెట్టిన రూ.110 కోట్ల డైట్ బిల్లులను చెల్లించిందన్నారు. ఎప్పటికప్పుడు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తూ వస్తోందన్నారు.

ఎంజేపీ గురుకులాల అభ్యున్నతికి తమ అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు. ఇటీవల ఆరు ఎంజేపీ గురుకుల బాలికల పాఠశాలలను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. కొత్తగా పది గురుకుల పాఠశాలలను మంజూరు చేశామన్నారు. ఇప్పుడు ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు కల్పించాలన్న లక్ష్యంతో రూ.500 కోట్ల సాస్కి నిధుల మంజూరుకు సీఎం చంద్రబాబు ఆదేశించడం ఆనందకర విషయమన్నారు.

డైట్ ఛార్జీల పెంపుతో సాస్కి నిధులు మంజూరుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేస్తూ, బీసీ బిడ్డల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. బీసీ గురుకులాల్లో సొంతింటి కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే ఎంజేపీ గురుకులాల్లో ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. బీసీ బిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించేలా సీఎం చంద్రబాబునాయుడు ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి సవిత ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!