కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ లో శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక భారతదేశ విశ్వ గురువుగా ఉండేది మళ్లీ ఆ స్థానాన్ని సంపాదించేందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. మన యోగాను పంచ యోగా దినోత్సవం గా జరుపుకునేలు చేయడంలో మోడీ గారు విజయం సాధించారు.
ఛత్రపతి శివాజీ భరతమాత ముద్దుబిడ్డ. ఆయన కమిట్మెంట్ ధైర్య సాహసాలు అనితర సాధ్యం. అన్ని మతాలను సమానంగా చూసిన మానవతావాది. ఆ మహనీయుని ఆశయాలు పునికి పుచ్చుకొని కోల్పోయిన విశ్వాసాలు సంప్రదాయాలు ఆలయాలను మన మోడీ , భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పునరుద్ధరిస్తూ కాపాడుతున్నారు.
ప్రపంచం ఉన్నంతవరకు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇతిహాసాలు మానవసంబంధాలు శాశ్వతంగా ఉంటాయి.మన స్పిరిచువల్ పవర్ అర్థం చేసుకొని ప్రపంచంలో అనేక దేశాలు మనలను అనుసరిస్తున్నాయి.
ప్రపంచానికి భారత దేశం మార్గదర్శిగా నిలబడుతుందన్నారు.
ఇక్కడ ఉన్న రోడ్డు సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. 12 సంవత్సరాల మోదీ పాలన చూసిన తర్వాత అన్ని రాష్ట్రాల ప్రజలు ఆయన పాలనాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోనుండి బయటపడాలన్న పాత గ్లోరీ రావాలన్నా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అందుకు అనుగుణంగా పని చేద్దాం.
ఈ కార్యక్రమంలో కత్బులపూర్ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్,బాచుపల్లి కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు,వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి,మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి,గాజులరామారం కార్పొరేటర్ శేషగిరి రావు,సీనియర్ నాయకులు సికింద్రాబాద్ జిల్లా ఇంచార్జ్ , SIR మేడ్చల్ మల్కాజ్గిరి ఇంచార్జి నందనందివాకర్,కాంటోన్మెంట్ బోర్డుమెంబెర్ భానుక నార్మధ మల్లికార్జున్,కాంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ బి ఎన్ శ్రీనివాస్, రంగారెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు మణికంఠ,సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





