తాళాయపాలెంలోని శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” షూటింగ్

Must read

తాళాయపాలెంలోని ప్రముఖ శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించినట్లు దర్శకుడు సుధాకరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ నటుడు కొండపల్లి అప్పారావు అఘోర వేషధారణలో అద్భుతంగా నటించారని పేర్కొన్నారు.శివశైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీశివ స్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం షూటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. మూడో షూటింగ్ షెడ్యూల్‌ను ఈ పవిత్ర శివక్షేత్రంలో నిర్వహించామని, ఆలయ పరిసరాల్లో చిత్రీకరణకు దేవాలయ అధికారుల నుంచి పూర్తి సహకారం లభించిందని చెప్పారు.ఈ చిత్రానికి నిర్మాతగా సంతోష్ రావు బల్గూరి వ్యవహరిస్తుండగా, దర్శకత్వ బాధ్యతలను సుధాకరరెడ్డి.టి నిర్వహిస్తున్నారు. కథా రచయితగా జగపతి శ్రీనివాస్, కెమెరామెన్ మరియు ఎడిటర్‌గా దాసరి రవికుమార్, సహ నిర్మాతగా రాజశేఖర్ రెడ్డి.డి పనిచేస్తున్నారు. పీఆర్ఓ గా ఎస్.ఏ.టి. శ్రీధర్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
త్వరలో హైదరాబాద్‌లో నాల్గో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు సుధాకరరెడ్డి వెల్లడించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!