అర్జీల పరిష్కారంలో బ్రాండ్ తెచ్చుకోవాలి:ముఖ్యమంత్రి చంద్రబాబు

Must read

అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని.. అలా జరగ్గకూడదని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజున వివిధ అంశాలపై సమీక్షించారు.

ఫైళ్ల క్లియరెన్స్.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, డేటా లేక్, అవేర్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఇ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడం మంచి పరిణామం. ఇ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలకు సీఎం అభినందనలు. పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినా సరాసరి 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్‌ను అభినందిస్తున్నా.

ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు వేగం పెంచాలి. గత మూడు నెలలతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి రెండు రోజులకు తగ్గింది. ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫైళ్ల క్లియరెన్స్ అతి ముఖ్యమైన అంశం.

సీఎస్, సెక్రటరీలు, హెచ్వోడీలు మొదలుకుని.. మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెరగాలి. మ్యానువల్ ఫైళ్లనేవి దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాలనకు టెక్నాలజీ అనుసంధానించడంతోపాటు… హ్యుమన్ టచ్ కూడా ముఖ్యం. మానవీయ కోణంలో ఆలోచించి పరిపాలన చేపట్టాల్సిన అవసరం ఉంది.

24 గంటల్లోపు ఇ-ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలి. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరి పని తీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే ఉన్నాం. జిల్లాల్లో ఇ-ఆఫీస్ ద్వారా లేని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించండి. జిల్లా స్థాయిలో, హెచ్ఓడీలు తప్పనిసరిగా ఇ-ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలి. ప్రజలకు సేవలందించే విషయంలో వినూత్న ఆలోచనలతో పాటు… మరింత మెరుగైన పాలనకూ కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలి.”అని సూచించిన సీఎం చంద్రబాబు.

పరిపాలనలో భాగంగా వేర్వేరు వెబ్ సైట్లు, డ్యాష్ బోర్డులు కాకుండా ఒకే ప్లాట్ ఫాంపై ఉండేలా చూడాలని ఐటీ శాఖకు సీఎం సూచించారు. అన్ని శాఖలకు సంబంధించిన కేపీఐలతో ఓ డ్యాష్ బోర్డు తయారు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. రోజువారీ లక్ష్యాలను ఈ డ్యాష్ బోర్డు నుంచి గుర్తించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని మంత్రి లోకేష్ చెప్పారు. 90 రోజుల్లో ఈ డ్యాష్ బోర్డును అందుబాటులోకి తెస్తామని ఐటీ మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!