మోదీ సభకు పరేడ్ గ్రౌండ్ సిద్ధం

Must read

ఈ నెల10వ తేదినా మోదీ హైదరాబాద్​ పర్యటన సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా హైదరాబాద్​ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిచనున్నారు. ప్రధాని పర్యటనతో కమల దళంలో మరింత కొత్త జోష్​ నింపేందుకు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనిలో జహీరాబాద్​ ఇంటిగ్రేటెడ్​ ఇండస్ట్రియల్​ స్మార్ట్​సిటీకి శంకుస్థాపనతో పాటు వరంగల్​ పీఎం మిత్ర మెగా టెక్స్​టైల్​పార్క్​ పాటు రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. బీజేపీ నిర్వహించే ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొంటారు. మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక రాష్ట్ర పర్యటనకు రానుండటం మొదటిసారి కావడంతో రాష్ట్రంలో కమలదళం ప్రతిష్ఠాత్మకంగా భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ఆదివారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని బెంగళూరు నుంచి స్పెషల్​ విమానంలో బయలుదేరి 2.20 గంటలకు హైదరాబాద్​లోని బేగంపేట ఎయిర్​పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు పలు ప్రాజెక్టులు పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హెలికాప్టర్​లో బయల్దేరి హైటెక్​సిటీకి వెళ్లి సింధు ఆసుపత్రిని ప్రారంభించి అక్కడి వైద్యనిపుణులతో మాట్లాడుతారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి బేగంపేట ఎయిర్​పోర్టుకు 4.40 గంటలకు చేరుకుంటారు.

సాయంత్రం 5.25 గంటలకు బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి 5.30 గంటలకు ​పరేడ్​ గ్రౌండ్​కు చేరుకుంటారు. 5.30 నుంచి 6.30 వరకు బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత బేగంపేటకు చేరుకుని సాయంత్రం 6.45 గంటలకు ప్రత్యేక విమానంలో గుజరాత్​లోని జామ్​నగర్​కు బయలుదేరుతారు.

సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్​, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి అధిక జనసమీకరణ చేస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దసంఖ్యలో వస్తారని మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదారు 2 లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు పేర్కొన్నారు.

మహబూబ్​నగర్​, ఖమ్మం, పెద్దపల్లి, కాగజ్​నగర్​ నుంచి పార్టీ శ్రేణులు, అభిమానుల కోసం నాలుగు ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు చేశారు. వీటితో పాటుగా సభ కోసం 3000 ఆర్టీసీ బస్సులనూ, అలాగే కళాశాలలు, పాఠశాలల బస్సులనూ కూడా బీజేపీ బుక్​ చేసింది. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు మోదీ సభ ఏర్పాట్లు, జనసమీకరణపై పార్టీ నాయకులతో బుధవారం సమావేశమై చర్చించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!