పేద విద్యార్థులు చదువుకు చేయూతనిస్తూ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం(2025-2026) లో ప్రథమ స్థానం ద్వితీయ స్థానం తృతీయ స్థానం పొందిన విద్యార్థిని విద్యార్థులకు తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద 25000, 15000, 10000 నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను అందజేశారు.
మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు. ఈ కార్యక్రమాన్ని మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన 151 మంది విద్యార్థిని విద్యార్థులను సన్మానించి 24,50000 రూపాయల చెక్కులతో పాటు జ్ఞాపికలను అందజేశారు.
పేదింటి విద్యార్థులకు చేయూతనిస్తూ ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత ఏడాది జులై 6న, 2024-2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మొదటి ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి వరుసగా 15000, 10000, 7500 రూపాయల నగదు బహుమతిని 62 ప్రభుత్వ పాఠశాలలోని 189 విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు.
అదే స్ఫూర్తితో ఈ ఏడాది మరో అడుగు ముందుకేసి ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లకు నగదు బహుమతిని అందించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఈ సహాయానికి పేద తల్లిదండ్రుల్లో తమ పిల్లల్ని బాగా చదివించాలని ధైర్యం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల్లో పోటీ తత్వం పెరిగి మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు చేస్తున్న ఈ సహాయానికి విద్యార్థిని విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొంది భవిష్యత్తులో తాము కూడా ఎదిగి పదిమందికి సహాయం చేసే విధంగా తయారవుతామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు
కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ లక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చెప్పిన మాటలకు మేము కూడా స్ఫూర్తి పొందుతున్నామని, ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని, ప్రతి విద్యార్థిని విద్యార్థి భవిష్యత్తులో పదిమందికి సాయం చేసే విధంగా తయారవ్వాలని ఆకాంక్షించారు.
2018 లో గడపగడప తిరిగి ఎంతో మంది సమస్యలు తెలుసుకున్నామని పది సంవత్సరాలుగా రాజగోపాల్ రెడ్డి గారు ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని, మునుగోడు నియోజకవర్గం నాయకులందరూ మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను నా దృష్టికి తీసుకూరావాలని కోరారు.





