తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకో మృణల్​ .. అల్లు అరవింద్

Must read

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘డెకాయిట్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు సాగుతోంది. కథ, నటీనటుల ప్రదర్శన, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు కలిసి చిత్ర విజయాన్ని జరుపుకున్నారు.

ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, నిర్మాతలు బన్నీ వాసు, స్వప్న దత్‌తో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సినిమా తీసిన విధానం, కథ ఎంపిక, నటీనటుల కృషి ని వారు కొనియాడారు.

అయితే ఈ సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన మాటలు కొందరికి ఆసక్తికరంగా అనిపించగా, మరికొందరు వాటిపై చర్చలు కొనసాగిస్తున్నారు.

మృణల్ నువ్వు తెలుగు వాడిని పెళ్ళి చేసుకుని ఇక్కడే ఉండిపో అంటూ అల్లు అరవింద్​ చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదే సయమంలో మృణలు చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.

మృణాల్ ఠాకూర్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందని, సినిమాలో ఆమె పాత్రకు మంచి స్పందన లభిస్తోందని పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. అడివి శేష్ కూడా తన పాత్రలో చక్కని నటన ప్రదర్శించి చిత్ర విజయానికి ప్రధాన కారణంగా నిలిచారని ప్రశంసలు అందుకున్నారు.

సినిమా విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలు నెలకొన్న ఈ చిత్రం, విడుదల అనంతరం మిశ్రమ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా నిలదొక్కుకోవడం విశేషంగా మారింది. ముఖ్యంగా యూత్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నట్లు సమాచారం.

సక్సెస్ మీట్ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. తమ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలను అందిస్తామని హామీ ఇచ్చింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!