‘ప్రేమ’ ముసుగులో మతం మార్పిడి దందా

Must read

హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో యువతులను వలలో వేసి, మతం మార్చు కోవాలని వేధింపులకు పాల్పడుతున్న ఘటన నగర వ్యాప్తంగా కలకలం రేపింది.

నగరంలోని జమీర్, అతని తమ్ముడు మిరాజ్ అనే ఇద్దరు అన్నదమ్ములపై ఈ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరూ పక్కా ప్రణాళికతో అమాయక యువతులను టార్గెట్ చేస్తూ, ప్రేమ పేరుతో నమ్మకాన్ని పొందిన తర్వాత వారిని మతం మార్చుకోవాలని వేదిస్తున్నట్లు వెల్లడైంది.

ఇప్పటివరకు ఐదుగురు హిందూ యువతులు ఈ మోసానికి గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రేమ సంబంధాన్ని నమ్మించి, తర్వాత మత మార్పిడి కోసం ఒత్తిడి చేయడం, అలాగే మానసికంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

నిందితుల్లో ఒకరైన జమీర్‌పై గతంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదై ఉండటం గమనార్హం. ఒక మైనర్ బాలికపై వేధింపుల కేసులో అతను జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ, ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని పోలీసులు గుర్తించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జమీర్ తన తమ్ముడు మిరాజ్‌తో కలిసి మళ్లీ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలుస్తుంది.

తాజాగా ఓ యువతిని ప్రేమ పేరుతో ఆకర్షించిన జమీర్​, ఆమెను లొంగదీసుకున్నాడు తదనంతరం అతని అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, మతం మార్చుకోవాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని అన్నతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఇద్దరూ కలిసి యువతిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, సోషల్ మీడియా చాట్స్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది.

మహిళలలు డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా ద్వారా ఏర్పడే సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత ఘటనలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. యువతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిచయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులు కూడా పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను గమనించాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!