రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్.. గుంటూరు వ్యక్తి అరెస్ట్

Must read

ప్రముఖ నటి నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా రీల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యు చేసిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ర్టంలోని గుంటురు జిల్లాకు చెందిన చెన్నయ్య రుంజాల అనే వ్యక్తి సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు తన యూట్యూబ్ ఖాతా ద్వారా రేణు దేశాయ్ పోస్టు చేసిన రీల్‌ను చూసి, దానిపై అసభ్యకరమైన వ్యాఖ్య పోస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

ఇటీవల సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపుల గురించి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఈప్రక్రియలో చెన్నయ్య రుంజాల అనే వ్యక్తి చేసిన కామెంట్‌ను గుర్తించి, అతడి వివరాలను సేకరించారు. నిందితుడు గుంటూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అతనిని గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడు తన మొబైల్ ఫోన్ నుంచే ఆ అసభ్యకర వ్యాఖ్యను పోస్ట్ చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.సోషల్ మీడియా వేదికలపై ప్రముఖులు, మహిళలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులను సహించబోమని స్పష్టం చేశారు.

గతంలో కూడా రేణు దేశాయ్ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై పలుమార్లు స్పందించారు. పవన్​ కళ్యాణ్​
తో విడాకులైన తర్వాత తనపై వ్యక్తిగతంగా దాడులు పెరిగాయని, సోషల్ మీడియాలో అనవసరంగా తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు తన మానసిక ప్రశాంతతను భంగం చేస్తున్నాయని కూడా ఆమె వెల్లడించారు.

సోషల్ మీడియా వినియోగదారులకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు, బెదిరింపులు, వ్యక్తిగత దూషణలు వంటి చర్యలు చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయని స్పష్టం చేశారు. అవసరమైతే కఠిన శిక్షలు విధించబడతాయయని తెలిపారు. యువత అనవసరమైన విషయాలతో తమ భవిష్యతును నాశనం చేసుకోవద్దని హితువు పలికారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!