టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా పేరుగాంచిన రామ్ పోతినేని మరోసారి తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరిగా భావించబడుతున్న ఈ యువ హీరో, తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై ఓఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉండటాన్ని ఆస్వాదిస్తున్నానని, అదే తనకు ఇష్టమన్నారు.
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ పోతినేని, “సింగిల్‌గా ఉండటం అనేది నేను కావాలని తీసుకున్న నిర్ణయం కాదు. అది సహజంగా నా జీవితంలో భాగమైపోయింది” అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం సింగిల్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాన్నారు.
రామ్ చిన్నప్పటి నుంచి ఒంటరిగా గడపడం అలవాటు చేసుకున్నట్లు తెలిపారు. తనకు ఏకాంతం అంటే ఎంతో ఇష్టమని, ఆ సమయంలో తాను తనను తాను మరింతగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఖాళీ సమయాన్ని సార్థకంగా వినియోగించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతున్నానని ఆయన తెలిపారు.
స్నేహితులతో గడపడం కూడా తనకు ఇష్టమేనని, కానీ తనకోసం కొంత సమయం కేటాయించుకోవడం ఎంతో అవసరమని రామ్ పేర్కొన్నారు. ఒంటరి సమయంలో తాను సినిమాలు చూడటం, సంగీతం వినడం, ఆలోచనల్లో మునిగిపోవడం వంటి విషయాలతో సమయాన్ని గడుపుతాన్నారు. ఈ సమయం తనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు.
తన వ్యక్తిత్వంలో భాగంగా మారిన ఈ సింగిల్ జీవితం తనకు ఎలాంటి ఒత్తిడిని కలిగించదని రామ్ స్పష్టం చేశారు. సమాజంలో పెళ్లి, రిలేషన్‌షిప్‌లపై ఉండే అంచనాలు వేరే విషయం అయినప్పటికీ, తాను మాత్రం తనకు నచ్చిన విధంగా జీవించడానికే ప్రాధాన్యత ఇస్తానన్నారు.
రామ్ పోతినేని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆయన ఆలోచనలను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు భవిష్యత్తులో ఆయన పెళ్లిపై ఆసక్తి చూపుతున్నారు.





