హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

Must read

నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు భారీ స్థాయిలో దాడులు విజయం సాధించారు. చిలకలగూడ, ఆదిభట్ల, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో పోలీసులు భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.64.35 లక్షల విలువైన డ్రగ్స్‌ను పట్టుకుని ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

డీసీపీ వైభవ్​ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్​ నగరంలో డ్రగ్స్ సరఫరా బారిగా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక ప్రణాళికతో దాడులు చేశామని ఈ దాడులు భారీ మొత్తంలో డ్రగ్స్ ని స్వాదీనం చేసుకున్నామని, నిర్వహించి నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్‌తో పాటు ఒక ద్విచక్ర వాహనం, రూ.50,000 నగదు, పలు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ పరికరాలు డ్రగ్స్ రవాణా, వ్యాపారానికి ఉపయోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

నిందితుల గతాన్ని పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని. నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు విచారణలో తేలిందన్నారు.

యువత డ్రగ్స్ మాఫియాలో చేరడం నగరానికి ప్రమాదకరమని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సరఫరా చేయడం వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, తరచూ దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

నగరంలో డ్రగ్స్ సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ గట్టి చర్యలు తీసుకుంటుందని.. గూఢచారి సమాచారాన్ని ఉపయోగించి మాఫియాను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని వారు కోరారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!