విజయ్ నామినేషన్లకు రెండు చోట్లా తొలగిన అడ్డంకులు

Must read

ప్రముఖ నటుడు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన నాయకత్వంలోని (టీవీకే) పార్టీ తరఫున విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తుండడం విధితమే. ఆయన దఖాలు చేసిన నామినేషన్ల పత్రాల్లో తప్పులు ఉండడంతో అధికారులు వాటిని నిలిపివేశారు. తాజాగా నామినేషన్లపై వచ్చిన అనిశ్చితికి తెరపడింది. ఆయన సమర్పించిన అఫిడవిట్లలో తలెత్తిన పొరపాట్లను సవరించి తిరిగి సమర్పించడంతో ఎన్నికల అధికారులు చివరకు నామినేషన్లను ఆమోదించారు.

విజయ్ ఈసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. చెన్నై నగరంలోని పేరంబురు నియోజకవర్గం నుంచి మార్చి 30న నామినేషన్ దాఖలు చేయగా, తిరుచురపల్లి ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఏప్రిల్ 2న నామినేషన్ సమర్పించారు. ఈ రెండు నామినేషన్ పత్రాల్లోని అఫిడవిట్లలో తేడాలు ఉండటంతో ఎన్నికల అధికారులు వాటిని తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచారు.

క్రిమినల్ కేసుల వివరాలు, వ్యక్తిగత సమాచారం విషయంలో ఉన్న వ్యత్యాసాలు అనుమానాలకు తావిచ్చాయి. తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన అఫిడవిట్‌లో విజయ్ తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పెరంబూర్ నియోజకవర్గానికి సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం ఎలాంటి కేసులు లేవని పేర్కొనడం వివాదాస్పదమైంది.

అదేవిధంగా వయస్సు వివరాల్లో కూడా తేడాలు కనిపించాయి. ఒక అఫిడవిట్‌లో తన వయస్సును 52 సంవత్సరాలుగా పేర్కొనగా, మరొక దానిలో 51 సంవత్సరాలుగా నమోదు చేశారు. ఈ పొరపాట్లు సాంకేతిక లోపాలా లేక నిర్లక్ష్యమా అన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతొ నాడు నిలిపి వేసిన నామినేషన్ల అడ్డంకి నేడు తొలగిపోయింది.

ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించి, వివరణ కోరారు. విజయ్ తరఫున వెంటనే స్పందించి అఫిడవిట్లలో ఉన్న తప్పులను సరిచేసి కొత్త పత్రాలను సమర్పించారు. సవరించిన అఫిడవిట్లను పరిశీలించిన అధికారులు, అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకుని ఆయన నామినేషన్లను ఆమోదించారు.

ఈ పరిణామంతో విజయ్ పోటీకి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ప్రస్తుతం ఆయన రెండు నియోజకవర్గాల్లోనూ అధికారికంగా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నిర్ణయం ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!