దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్.. ఏసీబీ వలలో పడిన అవినీతి చేప

Must read

ఏపీలో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న కలింగిరి శాంతిను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

మంగళవారం ఉదయం నుంచే (ఏసీబీ) బృందాలు సమన్వయంతో దాడులు ప్రారంభించారు. తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాలతో పాటు మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడులు సుమారు ఆరు గంటల పాటు కొనసాగాయి. ముందస్తుగా ప్రణాళిక రూపొందించి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ సోదాల సందర్భంగా భారీగా ఆస్తులు బయటపడటం గమనార్హం. విశాఖపట్నం నగరంలోని ఎండాడ ప్రాంతంలో ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ను అధికారులు గుర్తించారు. తాడేపల్లి సమీపంలోని కంచన్​పల్లిలో జీ+2 భవనం కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆస్తుల విలువ గణనీయంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవి మాత్రమే కాకుండా, 770 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 3 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా రూ.1.15 లక్షల నగదు కూడా లభించింది. బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం కూడా ఆస్తుల జాబితాలో ఉన్నాయి.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆస్తులు అధికారికి తెలిసిన ఆదాయ వనరులకు మించినవిగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ కేసును సీరియస్‌గా తీసుకుని పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు. అన్ని ఆస్తుల విలువను లెక్కించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో మరోసారి అవినీతి అంశం చర్చ మొదలైంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజా సేవలో ఉన్నవారు పారదర్శకత, నిజాయితీతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు సూచిస్తున్నారు.

ప్రభుత్వం వీరికి జీతాలు ఇస్తున్నప్పటికీ డబ్బు వ్యామోహంలో పడి ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నారని, ఇవి బయట పడితే ఎప్పటికైనా ప్రమాదమే అని.. ప్రజా సేవకు మంచి అదృష్టం లేదని అధికారులు ప్రభుత్వ అధికారులకు సూచించారు.

ఈ సోదల్లో అక్రమ ఆస్తులు భారీ మొత్తంలో బయట పడడంతో కాళింగిరి శాంతిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇతరుల పాత్రపై కూడా విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు కీలకంగా మారాయి. ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇటువంటి చర్యలు అవసరమని అధికారులు.. రాజకీయ విశ్లేషికులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!