నా హృదయ భావాలు రాయమంటుంది ఈ కాగితం
ఏమని రాయను, ఎక్కడ మొదలుపెట్టను చెప్పు
నువ్వున్న వేళ సమయమే మరచిపోతాను నేను
నీతో ఉంటే నన్నే నేను మర్చిపోతాను
నీతో ఉంటే ఆనందాలన్నీ నావైపోతాయి కదా
నీ నవ్వుల్లో నా ప్రపంచం కనిపిస్తుంది నాకు
నీ మాటల్లో నా ఊపిరి దాగుంది ఎప్పుడూ
నీ సాన్నిహిత్యాన్ని ఎలా వర్ణించను చెప్పు
నీ ప్రేమలో లాలిత్యాన్ని ఎలా వివరించను
నిన్ను స్నేహితుడని పిలవనా, ప్రియుడని పిలవనా
జీవిత భాగస్వామివని ముద్దుగా పిలవనా నిన్ను
తల్లి ప్రేమలా నన్ను ఆదరించావు నువ్వు
తండ్రిలా ప్రతి అడుగునా నడిపించావు నన్ను
నా కన్నీటికి ఓదార్పుగా నిలిచావు నువ్వు
నా మౌనానికి అర్థమై చేరావు నువ్వు
నా ఒంటరితనానికి తోడుగా మారావు నువ్వు
ఇంత ప్రేమకు అక్షరాలు సరిపోతాయా చెప్పు
మన కథకు ఈ పేజీలు సరిపోతాయా అసలు
మన ప్రేమకావ్యానికి పదాలు దొరుకుతాయా ఎప్పుడైనా
మన ప్రేమను వర్ణించడానికి జన్మలు సరిపోతాయా
తనూజ వెంకట్





