అమ్మ ఒడిలో పూసినా అందమైన బంధం
అన్నా – చెల్లెలి అనుబంధం
చేతికి కట్టే ఒక సన్నని దారం కాదది
మనసులని కలిపే గొప్ప బంధం అది
సోదరి సోదరుల అనురాగానికి ప్రతీక
ఎప్పటికి నిలిచిపోయే ఓ మధుర జ్ఞాపిక
రాఖీ కేవలం దారం కాదు
మనసులని కలిపే వారధి
ఇలలోనా గొప్ప బంధం
సోదర సోదరీల బంధం
జీవితాంతం తమ సోదరికి తోడుగా నిలుస్తానని
సోదరుడు చేసే ప్రమాణం ఈ రాఖీ
రాఖీ దారంలో ప్రేమ ఉంది
రాఖీ ముడిలో నమ్మకం ఉంది
ఎన్ని ఏళ్లు అయినా ఆ అనురాగం
ఆ బంధం స్వచ్ఛంగా మిగిలిపోవాలని చేసే గొప్ప సంతకం
అప్పె షర్మిల





