- ఇంద్రుడి విజయంతో ముడిపడిన రాఖీ కథ.. పురాణాల్లో ఆసక్తికర గాథ
- ఉత్తర భారతం నుంచి దేశవ్యాప్తంగా విస్తరించిన రాఖీ పండుగా
భారతదేశంలో అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెల్లు ప్రేమాభిమానలతో ఎంతో ఉత్సాహంగా సంతోషంగా జరుపుకునే పండగా రాఖీ పౌర్ణమి అన్నకు చెల్లి, చెల్లికి అన్నా జీవితాంతం కష్టసుఖాల్లో తోడుంటామని భరోసా ఇచ్చి జరుపుకునే పండగా రాఖీ పౌర్ణమి దీనినే రాక్షబంధన్ అని, కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని అంటారు. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే ఈ పండగను జరుపుకునే వారు. ప్రస్తుతం ఈ రాఖీ పండగను ఇప్పుడు భారదేశమంతా ఘనంగా జరుపుకుంటారు. ఈ రక్షాబంధన్ అనగా రాఖీ పండగా భారత దేశంలో ఎపుడు ఎలా ప్రారంభమైందో ఖచ్చితమైన అధారాలు సాక్ష్యాలు లేవు కానీ, పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు, కహానీలు ఉన్నాయి. మరి అవేంటివో తెలుసుకుందాం పదండి..
పురాణాల్లో విశ్వరూపుడు అనే మహర్షి తండ్రి త్వష్ణ ప్రజాపతి కోపంతో చేసిన యాగం నుంచి వృతాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. దేవదేవేంద్రుడు ఇంద్రుడు విశ్వరూపుడిని చంపుతాడు. దీంతో ఇంద్రుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి త్వష్ణ ఈ రాక్షసుడిని సృష్టింస్తాడు. వృతాసురుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, ఏ ఇనుప, చెక్క లేదా లోహపు ఆయుధాల చేత కూడా తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. దేవతలకు రాక్షసులకు జరిగే భీకర యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి రావడంతో అమరావతిలో తలదాచుకుంటాడు. విషయం తెలుసుకున్నా ఇంద్రుని భార్య శచీదేవి (ఇంద్రాణి) ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకు కడుతుంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను భక్తిశ్రద్ధలతో పూజించి తయారు చేసిన రక్షణ కవచం అది.. ఆ కవచం కట్టుకుని వెళ్లిన ఇంద్రుడు రాక్షసులని ఓడించి, విజయం సాధించారని ఓ కథ ఉంది.
బలిచక్రవర్తి భూమండలాన్ని అక్రమించుకున్నప్పుడు రాక్షసుల నుంచి మానవులను కాపాడడానికి శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూలోకానికి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఓ బ్రాహ్మణ యువతి రూపంలో బలి చక్రవర్తి దగ్గరికి వస్తుంది. సరిగ్గా ఓ శ్రావణ పౌర్ణమి రోజు పవిత్రదారాన్ని బలి చక్రవర్తి చేతికి కట్టి, తానెవరో చెబుతుంది. ఆ తర్వాత తన కోరికను బలిచక్రవర్తితో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి ని కలిగించి, విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమంటాడని మరో కథ.
శ్రీకృష్ణుడు శిశుపాలుని చంపడానికి సుదర్శనా చక్రాన్ని వాడినప్పుడు అతని చూపుడు వేలుకు గాయం అవుతుందట. ఆ గాయన్ని గమనించిన ద్రౌపదీ తన చీర కొంగును చింపి కృష్ణుడి చేతుకు కట్టు కట్టిందట. అప్పుడే శ్రీ కృష్ణుడు నేను నీకు ఎల్లాపుడు అండగా ఉంటానని హామి ఇస్తాడట. అందుకే ద్రౌపదీ వస్ర్తాభరణంలో శ్రీకృష్ణుడు ఆమెకు అండగా ఉంటాడని ఇంకో కథ.
విశ్వవిజేతగా నిలవాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. అదే సమయంలో బాక్ట్రియన్ యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. దీంతో జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు. అప్పుడే అలెగ్జాండర్ కు పురుసోత్తముడిపై యుద్ధానికి రావాలని అంబి అహ్వానిస్తాడు. జీలం నది వడ్డున పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు. పురుషోత్తముడి పరాక్రమాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడికి రాఖీ కట్టి
యుద్ధంలో భర్త అలెగ్జాండర్ ఓడిపోతే చంపవద్దని కోరుతుంది. దీంతో అలెగ్జాండర్‌ను చంపే అవకాశం చిక్కినా తన చేతికున్న రాఖీచూసి పురుషోత్తముడు విరమించుకున్నాడని చరిత్ర ఇంకో కథ చెబుతుంది.
ఈ రకంగా పురాణాల్లో రాఖీ భర్త గెలుపుకై భార్య కట్టిన రక్షణ కవచం ఒకటైతే. గాయపడిన కృష్ణుడికి ద్రౌపది కట్టిన కట్టుకు బదులుగా శ్రీకృష్ణుడు ఆమెకు అండగా ఉండడంతో అన్నా చెల్లెల్ల పండగా మారింది. ఆపదలో అన్నకు చెల్లి సహాయకురాలైతే అయితే చెల్లికి అన్న రక్షణ కవచంలా అండగా ఉండడమే రాఖీ పౌర్ణమి ముఖ్య ఉద్ధ్యేశం. ముందుగా రాఖీ పౌర్ణమి భార్యభర్తల మద్య విజయానికి గుర్తుగా ఉన్నా.. ద్రౌపదీ, లక్ష్మీదేవిల కథలో అన్నాచెల్లెల్ల ప్రేమానురాగాలను తెలియజేయడం ద్వారా ఈ పండగను అన్నా చెల్లెల్లు ప్రేమాభిమానాలతో జరుపుకుంటారు.
మానవ సంబంధాలు కనుమరుగౌవుతున్న నేటి కాలంలో రాఖీ పండగను జరుపుకోవడం ఎంతో ముఖ్యం. సోషల్ మీడియాలో వివ్స్ కోసం చేస్తున్న వీడియోల అదారంగా కాకుండా పురాణాల్లోని వాస్తవాలను తెలుసుకుని భారతీయులంతా సంతోషంగా సోదరసోదరీమణుల భావం కలిగి ఉండి ఈ పండగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
అమీనా కలందర్ (కవిరత్న)
సీనీయర్ జర్నలిస్ట్





