బీదరికపు మొగ్గ
పువ్వై వికసించినప్పుడు
సువాసనలు వెదజల్లుతూ
నేనున్నాని పూయించిది నవ్వులు
అమ్మమ్మా ఆశల పిందె
కాయగా మారి తీపిని పంచింది
తోటి వారి సంతోషమే లక్ష్యంగా
కల్లోని కుంటలో
కోయిలేదో కూసింది..
తెలుగు వెలుగులను చాటింది
కనబడని నాన్న చిరునవ్వులు
కల్లోనిలో కష్టాలు
చిట్యాలలో చిగురులు
అమ్మా ఆశయాలు
జీవితమే అమవాస్య చీకటి
రేపటికై నీరిక్షణ ఒకటి
ఊరు మారింది
బతుకు దేరువుకొరకు
ఏమైపోతాడో అనుకుంటే
ఏనుగొల్ల పేరును ఏడు
సంద్రాలు దాటించారు
ఎన్నో కష్టాలు
ఒడిదుడుకులు
బెదరలేదు.. అదరలేదు
అమ్మే ఆయుధమై
అమ్మమ్మా నీడలో
ఆ చిరు కొమ్మ.. పెరిగి
తెలగు మర్రి వృక్షమైంది
కొందరికీ ఊయాలలా
మరికొందరికీ నీడలా
బీదవారికీ తోడులా
కవులకు కలంలా
నిత్యం అనునిత్యం
పున్నమి చంద్రుడై
ఉండాలి మా మదిలో
అమీనా కలందర్
కవిరత్న,
నిండు నూరెళ్లు చల్లగా ఉండాలని
మనస్సారా ఆశిస్తూ..
మేమంతా మళ్లి మళ్లి
చెబుతున్నాము..
పుట్టినరోజు శుభాకాంక్షలు





