నంద్యాల జిల్లా, మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి భారీ కార్చిచ్చు సంభవించింది. ఈ ప్రమాదం దయ్యాలతిప్ప, మోకాళ్ల తిప్ప, మోటు వంటి ప్రాంతాల్లో వ్యాపించి, స్థానికంగా భయాందోళనలను రేకెత్తించింది. మంటలు క్రమంగా అదుపులోకి రావడం లేదని, విస్తరిస్తూనే ఉన్నాయని అటవీ
శాఖ అధికారులు తెలిపారు.
అడవుల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందగానే అటవీ శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ మంటలకు కారణం ఆగంతకులు, ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా అనే కోణంలో అరా తీస్తున్నారు.
ఈ ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతం ఎత్తైన కొండలపై ఉండటంతో, కాలినడకన సహాయక చర్యలు చేపట్టడం కష్టతరమవుతోందని, దీనికి తోడు వేసవి కాలం కావడంతో అడవి చెట్లు, ఆకులు పూర్తిగా ఎండిపోయి ఉండటంతో మంటలను వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, మంటలు అదుపులోకి రాకుండా ఉంటే, అటవీ ప్రాంతంలోని జీవవైవిధ్యం, జంతువులు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేము “మనం నిద్రపోవడం కష్టంగా మారింది. మంటలు దాని పక్కనే ఎగిసి వస్తున్నాయి. వన్యప్రాణులు, పక్షులు కూడా భయాందోళనలో ఉన్నాయి” అని సానికులు ఒకరు తెలిపారు. అటవీ అధికారులు, స్థానిక పోలీస్ సిబ్బందితో కలసి ప్రజలకు భద్రతా మార్గదర్శకాలను అందిస్తున్నారు.
భూ మార్గంలో మంటలు ఆర్పడం కష్టమౌతుందని.. హెలికాప్టర్ ద్వారా నీటిని చల్లితేనే పరిస్థితి తదుపులోకి వస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. గత నెలలో కూడా ఈ ప్రాంతంలో చెలరేగింది. అప్పుడు అధికారులు దాన్ని అదుపులోకి తెచ్చారు. ఇప్పుడు మరోసారి మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.
నల్లమల అటవీ ప్రాంతంలో తరచుగా అగ్నిప్రమాదాలు సంభవించడం ఆందోళన కరంగా మారింది. నిరంతర అగ్ని ప్రమాదాల ద్వారా వన్యప్రాణులకు హాని కలుగుతుందని అధికారులు ఆవేదన వ్యక్త పరిచారు. ప్రస్తుత మంటలు ఆపడానికి అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.





