కిశోరి వికాసంపై విజయవాడలోప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహణ

Must read

విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్ లో గల ఫార్మర్స్ ట్రైనింగ్ హాల్‌లో శనివారం కిశోరి వికాస కార్యక్రమంపై ప్రాంతీయ వర్క్‌షాప్ ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మహిళాభివృద్ధి & శిశు సంక్షేమశాఖ అధికారులు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, సీడీపీఓలు, హెల్త్, సెర్ప్, మెప్మా, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, స్వర్ణ గ్రామ & స్వర్ణ వార్డు సచివాలయ అధికారుల విస్తృత భాగస్వామ్యం తో నిర్వహించబడింది.

కిశోరి వికాసం వేసవి సమావేశాలు ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి షేక్ రుక్సానా సుల్తాన బేగం అధ్యక్షతన వర్క్‌షాప్‌ జరిగగింది. కిశోరి వికాసం వేసవి సమావేశాలు మే 1 నుండి జూన్ 10 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఈ సమావేశాలు కౌమార బాలబాలికలలో అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా చేపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. శ్రీలక్ష్మి మాట్లాడుతూ బాలికల సాధికారితకు సమన్వయంతో పని చేయాలన్నారు.

కిశోరి బాలికల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ వేసవి కార్యక్రమాలలో అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని తెలిపారు.

జిల్లా సెర్ప్ అధికారి హరినాథ్ మాట్లాడుతూ.. కౌమార దశలో బాలికలకు సరైన మార్గదర్శకత్వం, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ దశలో సమగ్ర అభివృద్ధి సాధిస్తే, భవిష్యత్తులో వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని చెప్పారు.

జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి బాను నాయక్ మాట్లాడుతూ… యువతలో అవగాహన లేకపోవడం వల్ల హెచ్‌ఐవి/ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. కిశోరి వికాస కార్యక్రమాల్లో ఈ అంశంపై ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించాలన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!